Special Status For Bihar: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీహార్ JDU పార్టీకి కేంద్రం మొండి చెయ్యి చూపించింది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (CM Nitish Kumar) చేసిన డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం తిరస్కిరించింది. అంతకముందు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు బీహార్‌లోని ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ (రామ్ విలాస్) కూడా బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (Central Government) స్పష్టంగా చెప్పింది.దీంతో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Bihar: బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం..స్పష్టం చేసిన కేంద్రం!
బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలేమని కేంద్రం వివరించింది. ఈ వివరణతో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Translate this News: