Nitya Menon: ఆ స్టార్ హీరో నన్ను వేధించాడు..నిత్యా మీనన్ షాకింగ్‌ కామెంట్స్‌!

తమిళ ఇండస్ట్రీ పై నిత్యా సంచలన కామెంట్స్(Comments) చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్(Star Hero) హీరో తనను వేధించాడని, దాని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పి ఆమె అందరికీ ఒక్కసారిగా షాకిచ్చింది.

Nitya Menon: ఆ స్టార్ హీరో నన్ను వేధించాడు..నిత్యా మీనన్ షాకింగ్‌ కామెంట్స్‌!
New Update

తెలుగు సినీ పరిశ్రమలోకి అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల మదిలో అలా పాతుకుపోయింది ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌(Nityamenon). ఆ తరువాత ఆమె కెరీర్ లో వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నిత్యా కూడా చాలా పొందికగా కథలు ఎంచుకుంటూ తనదైన నటన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇప్పటి వరకు నిత్యా వివాదాలకు దూరంగా నిలిచింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సినీ ప్రపంచం మొత్తం తన వైపు చూసేటట్లు చేసుకుంది. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీ పై నిత్యా సంచలన కామెంట్స్(Comments) చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్(Star Hero) హీరో తనను వేధించాడని, దాని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పి ఆమె అందరికీ ఒక్కసారిగా షాకిచ్చింది.

దీంతో ప్రస్తుతం తమిళనాట ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నిత్య ప్రస్తుతం కుమారి శ్రీమతి (Kumari Srimathi)అనే వెబ్ సిరీస్ (Web series) చేస్తోంది. గోమతేష్‌ ఉపాధ్యాయే ఈ వెబ్‌ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్ మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రిలీజ్‌ డేట్ త్వరలోనే ఉండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్..అందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ తమిళ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఓ స్టార్‌ హీరో నన్ను వేధించాడు..తమిళ పరిశ్రమల వల్ల నేను చాలా ఇబ్బందలు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది నిత్యా. ప్రస్తుతం నిత్య చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

#kollywood #tollywood #nitya-menon #comments
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి