Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithiin) షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్ తమ్ముడు(Tammudu) అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram), చిత్ర బృందం అంతా కలిసి ఏపీలోని మారేడుమిల్లికి వచ్చారు. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నితిన్ కు గాయాలు..
ఈ క్రమంలో హీరో నితిన్ కు గాయాలు అయినట్లు సమాచారం. దాంతో వెంటనే షూటింగ్‌ని నిలిపివేసి.. నితిన్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యాక్షన్ సన్నివేశాలు కావడంతో నితిన్ చేతికి బలమైన గాయాలు అయ్యాయి. నితిన్ ని పరిశీలించిన వైద్యులు కనీసం మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని తెలిపినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఆశలన్నీ తమ్ముడు మీదనే..
ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. గతేడాది నితిన్ కి చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. డిసెంబర్ లో ఎక్స్ ట్రా(Extra) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో నితిన్ ఆశలన్నీ ప్రస్తుతం తమ్ముడు సినిమా మీదనే ఉన్నాయి.
ఏకంగా పవన్ టైటిల్ తోనే..
డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) కూడా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సినిమాను షూట్ చేస్తున్నారు. హీరో నితిన్ పవన్ కల్యాణ్ కు ఎంత వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో కూడా పవన్ పేరును వాడకుండా ఉండాడు. అలాంటిది ఈసారి ఏకంగా పవన్ టైటిల్ తోనే సినిమాను తీస్తున్నాడు.
అక్కా తమ్ముడి నేపథ్యంలో సినిమా ఉండనుందని సినీ వర్గాల టాక్. అందుకే తమ్ముడు టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also read: చలికాలం రూమ్ హీటర్‌ని ఎక్కువగా వాడుతున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!