Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటన.. విచారణలో బీజేపీ కార్యకర్త

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో ఓ బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో అతనికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.

New Update
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటన.. విచారణలో బీజేపీ కార్యకర్త

Rameshwaram Cafe Blast: ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేస్తోంది. అయితే పేలుడుకు సంబంధించి ఈ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ పేలుడులో బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలోని బీజేపీకి చెందిన కార్యకర్త (BJP Candidate) సాయి ప్రసాద్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  రాగల రెండు రోజులు వడగాల్పులు.. బయటకు రావొద్దని హెచ్చరిక

ఇక రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో.. సాయి ప్రసాద్‌కు సంబంధాలున్నాయనే ఆరోపణలతో NIA అతడిని విచారణకు పిలిచింది. అయితే రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి 10 రోజుల క్రితం ఎన్‌ఐఏ పలు ఇళ్లు, దుకాణలపై దాడులు నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పడు ఈ వ్యవహారంలో బీజేపీ కార్యకర్త పేరు బయటపడటం చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా.. రామేశ్వరం కేఫ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌ను వదిలిపెట్టి వెళ్లిన తర్వాత.. అందులో ఉన్న బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

Also Read: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Advertisment
తాజా కథనాలు