/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Cafe-2-jpg.webp)
Rameshwaram Cafe Blast - Rs 10 lakh Reward: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ కేంద్ర ఏజెన్సీ ఓ కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. నిందితుడి ఫొటోలను కూడా అధికారులు విడుదల చేశారు. అతడి గురించి సమాచారం చెప్పిన వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది .
Also Read: గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -2, గ్రూప్-3 పరీక్ష తేదీల ప్రకటన
అదుపులో నలుగురు అనుమానితులు
మార్చి 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు (Rameshwaram Cafe Blast) జరగగా.. ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆర్‌డీఎక్స్ అనే పేలుడు పదార్థాన్ని వినియోగించినట్లు నిపుణులు గుర్తించారు. అయితే నిందితుడు కేఫ్‌లోకి ఎలా చొరబడ్డాడు ? బాంబును అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు ? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
NIA announces cash reward of 10 lakh rupees for information about bomber in Rameshwaram Cafe blast case of Bengaluru. Informants identity will be kept confidential. pic.twitter.com/F4kYophJFt
— NIA India (@NIA_India) March 6, 2024
ఉగ్రకుట్రనా ?
కేఫ్‌లో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 300 సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. తెల్లటోపీ ధరించిన ఓ వ్యక్తి.. నోటికి మాస్కు కట్టుకుని, బ్యాగ్ వేసుకొని కేఫ్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. టైమర్ బాంబు బ్యాగు అక్కడ పెట్టే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఆ నిందితుడు వైట్‌ఫీల్డ్-కుందేనహళ్లి మధ్య బీఎంటీసీ బస్సులో ప్రయాణించి సీఎంఆర్‌టీ బస్‌స్టాండ్‌లో దిగి రామేశ్వరం కేఫ్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నెటీజన్లు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుడి ఆచూకి తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటన వెనుక ఏదైన ఉగ్ర కుట్ర కోణం కూడా ఉందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏఐ రోబో టీచర్ వచ్చేసిందోచ్.. ఎక్కడంటే