Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఝూన్సీ - కాన్పూర్ రహదారిపై డీసీఎం, కారు ఢీకొనడంతో.. కారులో ప్రయాణిస్తున్న ఓ వరుడి(Bride Groom) తో సహా నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరిని అక్కడి స్థానికులు కాపాడారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీ జిల్లా ఎరిచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాటి గ్రామానికి చెందిన ఆకాష్‌కు మే 10 న పెళ్లి జరిగింది. పెళ్లి ఊరేగింపు(Wedding Procession) లో భాగంగా.. అతడు కారులో ఛపర్ అనే గ్రామానికి వెళ్తున్నాడు. ఆ కారులో వరుడు ఆకాశ్‌తో పాటు తన సోదరుడు ఆశిష్, మేనల్లుడు ఐషు (7), మరో ఇద్దరు బంధువులు ఉన్నారు. అయితే కారు.. కాన్పూర్ రహదారిపై పారిచా ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే వెనక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొంది.
Also read: భారత్‌కు చెందిన హనుమాన్ ఏఐ మోడల్ వచ్చేసింది
దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాళ్లు కేకలు వేశారు. వరుడు ఆకాష్, ఆశిష్, ఐషు, డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. ఇంతలోనే వెనక నుంచి కారులో వచ్చిన బంధువులు ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది(Fire Fighters) ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. డీసీఎం డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగతోంది.
Also Read: ఆఖరి రోజు.. తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్ ఇదే!