Credit card: క్రెడిక్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. రేపటి నుంచే కొత్త రూల్స్! బ్యాంక్ కస్టమర్లు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్. జులైలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నియమ, నిబంధనలు మారబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 30 Jun 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి New Rules: బ్యాంక్ కస్టమర్లు, ముఖ్యంగా క్రిడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. జులై 1 నుంచి బ్యాకింగ్ లావాదేవీలు, క్రిడిక్ కార్డు బిల్లులకు సంబంధించి కొత్త రూల్స్ అమలుకాబోతున్నాయి. పెద్ద బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నియమ, నిబంధనలు పూర్తిగా మారబోతున్నాయి. క్రెడిట్ కార్డ్ సేవలలో భారీ మార్పులు.. ఈ మేరకు ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంక్‌లు కస్టమర్లకు అందించే తమ క్రెడిట్ కార్డ్ సేవలలో భారీ మార్పులు చేశాయి. క్రెడిట్ రివార్డ్ పాయింట్లు, నిలిపివేయబడే ఛార్జీలు, రివార్డ్ పాయింట్ ప్రయోజనాలు, కార్డ్‌ల విలువ తగ్గింపు లాంటివివాటిని పూర్తిగా మార్చేయనున్నాయి. ఎబ్బీఐ క్రెడిట్ కార్డ్ 2024 జులై 1 నుంచి క్రెడిట్ కార్డ్‌లకు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు నిలిపివేయనుంది. జులై 15 నుంచి అమలులోకి వచ్చే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు సంబంధించి 22 రకాల క్రెడిట్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్లు వర్తించవని ఎబ్బీఐ క్రెడిట్ వెబ్‌సైట్ లో స్పష్టం చేసింది. ఐసీఐసీఐ.. అలాగే జులై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సేవల్లో మార్పులు చేయనుంది. అన్ని కార్డ్‌లపై (ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మినహా) కార్డ్ రీప్లేస్‌మెంట్ రుసుము రూ. 100 నుండి రూ. 200 వరకు పెంచనుంది. హెచ్‌డీఎఫ్‌సీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపుల కోసం కొత్త రేట్లను అమలు చేసింది. ప్రతి లావాదేవీకి రూ. 3,000 సీలింగ్‌తో అద్దె లావాదేవీలపై వినియోగదారులకు 1 శాతం ఫీజు విధించబడుతుంది. ఆగస్టు 1 నుంచి అమలు కానుంది. సిటీ బ్యాంక్.. ఇక సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు యాక్సిస్ బ్యాంక్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపింది. జూలై 15 నాటికి కార్డ్‌తో సహా అన్ని సంబంధాల మైగ్రేషన్ పూర్తవుతుందని తెలిపింది. అలాగే సిటీ-బ్రాండెడ్ కార్డ్ వినియోగదారులు.. తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను స్వీకరించే వరకు సజావుగా ఆ పాత కార్డులు పని చేస్తూనే ఉంటాయని తెలిపింది. * చెక్/క్యాష్ పికప్ ఫీజు ఒక్కో పికప్‌కు రూ. 100 ఫీజు నిలిపివేయనుంది. * ఛార్జ్ స్లిప్ అభ్యర్థనలో ఛార్జ్ స్లిప్‌కు రూ. 100 ఫీజు నిలిపివేయనుంది. * డయల్-ఎ-డ్రాఫ్ట్ – లావాదేవీ రుసుములో కనిష్ట ధర రూ. 300తో డ్రాఫ్ట్ విలువ మొత్తంలో 3 శాతం తగ్గింపు. * అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజులో చెక్కు వాల్యూలో 1 శాతం, కనీసం రూ. 100కి లోబడి రద్దు. * డూప్లికేట్ స్టేట్‌మెంట్ అభ్యర్థన (3 నెలలకు మించి) విషయానికి వస్తే.. డూప్లికేట్ స్టేట్‌మెంట్ కోసం రూ. 100 రుసుము నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. మొత్తంగా ఐసీఐసీఐ బ్యాంకు రూల్స్‌తో కొంతమేర వినియోగదారులకు లబ్ధిచేకూరనుంది. #credit-card #hdfc-bank #sbi-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి