/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/13-jpg.webp)
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కంగువ' (Kanguva). శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 3డీ ఫార్మాట్‌లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమానుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండగా తాజాగా సూర్య లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்!
ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ!
ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! &
Happy Ambedkar Jayanthi! #Kanguvapic.twitter.com/MtTGPnzxw3— Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024
ఇది కూడా చదవండి:Soundarya: సౌందర్య అకాలంగా మరణిస్తుందని ముందే తెలుసా.. ఆ యాగాలు చేసింది నిజమేనా!?
2024లో విడుదల..
ఈ మేరకు నయా పోస్టర్ లో సూర్య ఓ టైప్ లుప్‌లో కనిపించాడు. ఒక వైపు పూర్తి ఆదివాసి అవతారంలో చూపించగా.. మరోవైపు అప్ డేట్ జనరేషన్ లో ష్యాషన్ లుక్ లో చూపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలావుంటే.. ఈ పోస్టర్ లో సినిమాను 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. కంగువ గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య 43లో సినిమా చేస్తున్నాడు.
.#Kanguvapic.twitter.com/97wFZXz4Kb
— Suriya Sivakumar (@Suriya_offl) March 19, 2024