Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌పై కొత్త చట్టం..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్‌ జిహాదీకి సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. అలాగే అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే పాలసీని కూాడా అమలుచేస్తామని ప్రకటించారు.

New Update
Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్‌ జిహాద్‌పై కొత్త చట్టం..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లవ్‌ జిహాద్‌'కు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. ఆదివారం అస్సాంలో రాష్ట్రస్థాయి బీజేపీ ఎక్జిక్యూటీవ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే లవ్‌ జిహాద్‌ గురించి మాట్లాడామని.. వీటికి సంబంధించిన కేసుల్లో త్వరలోనే జీవిత ఖైదు శిక్ష విధించే చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. ముస్లిం పురుషులు.. ముస్లిమేతర మహిళలను ఉద్దేశపూర్వకంగా ట్రాప్‌ చేసి పెళ్లి చేసుకొని.. బలవంతగా ఇస్లాం మతంలోకి మార్చడాన్నే లవ్‌ జిహాద్‌ అని అంటారు.

Also Read: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్‌ ప్రకటించిన బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌

ఇదిలాఉండగా.. హిమంత బిశ్వ శర్మ మరో కొత్త పాలసీని కూడా ప్రకటించారు. ఈ పాలసీ ప్రకారం అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అర్హత ప్రమాణాలు ఉంటాయని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విధానాన్ని కూడా తీసుకొస్తామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా.. రాష్ట్రంలో ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

మరోవైపు హిందువులు, ముస్లీంల మధ్య భూముల అమ్మకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. వీటికి సంబంధించిన పనులు ముందుకెళ్లాలంటే ముందుగా ముఖ్యమంత్రి నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా చేశామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2041 నాటికి అస్సాం ముస్లిం మెజార్టీ రాష్ట్రంగా మారుతుందని ఇటీవల హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రతి పదేళ్లకొకసారి ముస్లిం జనాభా 30 శాతం పెరుగుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర జనాభాలో 40 శాతం ముస్లింలు ఉన్నారని తెలిపారు. మరోవైపు హిందువుల జనాభా ప్రతి పదేళ్లకొకసారి కేవలం 16 శాతం మాత్రమే పెరుగుతోందని.. మస్లింల జనాభా మాత్రం దీనికి రెట్టింపుగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అయితే హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ దనీష్ అలీ తీవ్ర విమర్శలు చేశారు. అసత్యాలను ప్రచారం చేసి.. రాష్ట్రంలో ప్రజల మధ్య విభజనను సృష్టిస్తున్నారని ఆరోపించారు. జనాభా లెక్కల ప్రకారం.. 1951లో ముస్లి జనాభా 25 శాతం ఉందని.. 2011 నాటికి 34.22 శాతానికి చేరుకుందని స్పష్టం చేశారు.

Also Read: కోటి మంది బీహార్‌ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభిస్తారు: ప్రశాంత్ కిషోర్

Advertisment
Advertisment
తాజా కథనాలు