TSPSC Group 1 Notification Released: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్ సర్కార్. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉండే అవకాశముంది. అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలో గ్రూప్-1 కు అప్లై చేసుకున్నవాళ్లు.. ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవాలని TSPSC ఆదేశించింది.
Also Read: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..
ఇదిలాఉండగా.. ఏప్రిల్ 26, 2022న గ్రూప్-1 నోటిఫికేషన్‌ని విడుదల చేయగా.. దీనికి రెండుసార్లు ఎగ్జామ్ జరిగింది. ఒకసారి పేపర్ లీక్ జరగగా (Paper Leak), రెండోసారి సరిగ్గా బయోమెట్రిక్ తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో ఉన్న TSPSC ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇటీవల సప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుకే మద్దతిచ్చింది. దీంతో గ్రూప్-1 పరీక్షలు మరోసారి నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
గతంలో 503 పోస్టులకు మాత్రమే గ్రూప్ -1 పోస్టుల నోటిఫికేషన్ రాగా.. ఈసారి కాంగ్రెస్ సర్కార్ మరో 60 పోస్టులు పెంచింది. దీంతో మొత్తం 563 పోస్టులతో కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే గతంలో గ్రూప్ -1కి అప్లై చేసిన వారు కూడా.. ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని TSPSC సూచించింది. అయితే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Also Read: కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన యువతితో ఎస్ఐ ప్రేమ.. ఆపై అత్యాచారం!