Hyderabad : హైదరాబాద్‌లో కొత్త మోసం..అమ్మాయిలతో డేటింగ్ స్కాం హైదరాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల డేటింగ్ యాప్‌లతో పబ్ యజమానులు అబ్బాయిలను దోచుకుంటున్నారు. దీంట్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు లబోదిబో మంటూ ఏడుస్తున్నారు. By Manogna alamuru 07 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి New Fraud In Hyderabad : డేటింగ్ యాప్ (Dating App) లతో అమ్మాయిల కోసం చూస్తున్నారా.. యాప్‌లలో అమ్మాయిలు (Ladies) పరిచయం అవ్వగానే వావ్ అనుకుని వారి వెంట పబ్ (Pub) లకు పరుగెడుతున్నారా... అయితే తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ (Hyderabad) లో ఓ కొత్త రకం మోసం బయటకు వచ్చింది. ఇందులో డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన అమ్మాయిలు తర్వాత వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ తర్వాత కలుద్దాం అంటూ ప్రపోజ్ చేస్తున్నారు. కలిసాక హైటెక్ సిటీలో ఓ పబ్‌కి తీసుకెళుతున్నారు. అక్కడ ఖరీదైన మందు, ఫుడ్ ఆర్డర్ చేసి అమ్మాయిలు నెమ్మదిగా జారుకుంటున్నారు. దీంతో అబ్బాయిలకు వేల్లో బిల్లులు కట్టాల్సి వస్తోంది. ఇప్పటివరకు నగరంలో 8మంది అబ్బాయిలు మోసపోయారు. ఇప్పటివరకు 8మంది.. ఇందతా హైదరాబాద్‌లోని మోషే పబ్ (Moshe Pub) లో మాత్రమే జరుగుతున్నట్టు తెలుస్తోంది. హైటెక్ సిటీలో గలేరియా మాల్‌లో ఉన్న ఈపబ్ వాళ్ళే అమ్మాయిలను ఎరగా వేసి అబ్బాయిలను మోసం చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ముందు టిండర్, బంబుల్ లాంటి యాప్‌లలో అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. ఆ తర్వాత వారిని పబ్‌కు తీసుకెళ్ళి ఇదంతా చేస్తున్నారు. ఇటీవల ఓ యువ వ్యాపార వేత్త ఇలాగే మోసపోయాడు. రితిక అనే అమ్మాయి వలలో పడి 40 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో అతను పబ్ గురించి గూగుల్‌లో చూడగా అక్కడ కనిపించింన రివ్యూలతో మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. పబ్ యాజమాన్యమే కావాలని ఇలాంటి పనులు చేయిస్తోందని చెవ్యాపారవేత్త చెబుతున్నారు. దీని కోసం అమ్మాయిలను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారని వాపోతున్నారు. రెండు రోజుల పరిధిలోనే 8 మంది ఇలా మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ పబ్ మీద కానీ, మోసం మీద కానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. Also Read: మోదీ ఇక మీదట అలా చేస్తే కుదరదు.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు #hyderabad #scam #dating-app #moshe-pub మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి