Social Media:ఎక్స్‌లో కొత్త ఫీచర్...ఆడియో, వీడియో కాల్స్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చును. ఇప్పటికే ఎక్స్‌ను చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు దీనివల్ల మరింత ఎక్కువ అవుతుంది అంటున్నారు. By Manogna alamuru 21 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి X platform:ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక దాన్ని చాలా మారుస్తున్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడం దగ్గర నుంచి ఇంచుమించుగా ప్రతీనెలకో కొత్త ఫీచర్‌ను మారుస్తున్నారు. ఇందులో కొన్ని ఫెయిల్ అయినా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. మొదట్లో ట్విట్ర్ పేరును ఎక్స్ గా మార్చడాన్ని కూడా చాలా మంది ఒప్పుకోలేదు. ఏం బాలేదు అంటూ విమర్శలు చేశారు. కానీ తరువాత దానికే మెల్లిగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు తా.ఆగా ఎక్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. Also Read:విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఇంటర్న్‌షిప్ ప్రారంభం.. ఆడియో, వీడియో కాల్స్... ఎక్స్ యూజర్లను మరింత పెంచడానికి ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఇందులో ట్వీట్లు చేసుకోవచ్చు. మెసేజ్‌లు పెట్టుకోవచ్చును. కానీ ఇక మీదట ఎక్స్‌లో కూడా కాల్స్ చేసుకోవచ్చును. ఆడియో, వీడియో ఏ కాల్ అయినా ఎక్స్ ద్వారా చేసుకోవచ్చును. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకుయమాత్రమే అందుబాటులో ఉంది. కొద్దిరోజుల్లోనే త్వరలో అందరికీ అ్దుబాటులోకి తీసుకురానుంది ఎక్స్ ప్లాట్ ఫామ్. ఎలా చేసుకోవాలి.. ఎక్స్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ అండ్ సేఫ్టీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత డైరెక్ట్ మెసేజెస్ ఆప్షన్ ఎంచుకుంటే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మనల్ని అనుసరిస్తున్న వారు, మనం అనుసరిస్తున్న వారు, వెరిఫైడ్ యూజర్లు అనే ఆప్షన్లలో మనకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. అక్కడే కాల్ కూడా చేసుకోవచ్చును. #social-media #new-feature #x #plaform మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి