Whatsapp:ఇక మీదట వాట్సాప్ వెబ్‌కూ లాక్ స్క్రీన్ ఫీచర్

ఫోన్‌లో వాట్సాప్‌కు చాలా ఫీచర్స్ఉంటాయి. లాక్ స్క్రీన్, చాట్ లాక్ లాంటివి ఎన్నో పెట్టారు. ఫోన్‌లో అయితేమన వాట్సాప్ ఎవరూ ఓపెన్ చేయకుండా స్క్రీన్ లాక్ పెట్టుకోవచ్చు . అయితే ఇక మీదట ఇక్కడ కూడా వాట్సాప్‌ను లాక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెటా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Whatsapp:ఇక మీదట వాట్సాప్ వెబ్‌కూ లాక్ స్క్రీన్ ఫీచర్
New Update

చాలా మంది వెబ్‌లో వాట్సాప్‌ వాడుతుంటారు. చాలాసార్లు లాగిన్ అయి మరిచిపోతుంటారు కూడా. దీనివల్ల వేరే వాళ్ళు మన చాట్ చూసే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఇప్పుడు వెబ్ వాట్సాప్​ కూడా లాక్ వేసుకోవచ్చును. వెబ్ వాట్సాప్​లోనూ లాక్ స్క్రీన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట మాటిమాటికీ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లాగిన్‌ అవ్వడానికి విసుగెత్తిపోయే వారు ఈ ఫీచర్​ను యూజ్ చేసుకుని లాక్ వేసుకోవచ్చును.

Also Read:నీలికళ్ళ సోయగం, వన్నే తరగని సౌందర్యం ఐశ్వర్య సొంతం

తరచూ లాగిన్, లాగవుట్ అవ్వడం ఓ పెద్ద పని. ఇలి చేయడం వలన లాస్ట్ మెసేజ్‌లు వెంటనే కనిపించవు కూడా. మాటిమాటికీ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లాగిన్‌ కావటం విసుగు తెప్పించొచ్చు కూడా. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా చూడటానికి లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.ముందుగా web.whatsapp.com లో క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ కావాలి. తర్వాత పైన ఉండే మూడు చుక్కల గుర్తు మీద క్లిక్‌ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి. సెటింగ్స్‌లో కిందికి స్క్రోల్‌ చేస్తూ వెళ్లి, లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తెర మీద కనిపించే సూచనలు పాటిస్తూ పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవాలి. ఓకే మీద నొక్కితే పాస్‌వర్డ్‌ కన్‌ఫర్మ్‌ అవుతుంది.కావాలనుకుంటే ఆటోమేటిక్‌ స్క్రీన్‌ లాక్‌ టైమింగ్‌నూ ఎంచుకోవచ్చు. దీంతో నిర్ణయించుకున్న సమయం తర్వాత దానంతటదే స్క్రీన్‌ లాక్‌ అయిపోతుంది.

Also read:నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు

#whats-app #new #web #app #feature
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe