news click: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్

చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని, వారికి నిధులు అందాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై ఢిల్లీ పోలీసులు మరో కొత్త కేసు నమోదు చేశారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

news click: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్
New Update

చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థ కార్యాలయాలు, ఉద్యోగులు, జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లతో పెద్దెత్తున ఈ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఆధారాల సేకరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. హార్డ్ డిస్క్ డేటాను కూడా పోలీసులు తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మరింత ముందుకు వెళ్ళారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను అరెస్ట్ చేశారు. చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడానికి ప్రబీర్ నిధులు అందుకున్నారని ఆరోపణలు రావడంతో ఉప చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూస్ క్లిక్ కు వచ్చే విదేశీ నిధుల దర్యాప్తు ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

నిధులకు సంబంధించి న్యూస్ క్లిక్‌పై ED ఇప్పటికే దాడి చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, న్యూస్ క్లిక్‌లోని కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు జర్నలిస్టుల స్థలాలపై సోదాలు చేశారు. నిన్న న్యూస్ క్లిక్ సంస్థకు చెందిన కార్యాలయంతో, జర్నలిస్టుల ఇళ్ళతో పాటూ 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్ సెల్ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్ళారు. ప్పటివరకు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. అయితే అమిత్ చక్రవర్తికి ఈ కేసుతో ఏమిటి సంబంధం అనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. అంతకుముందు న్యూస్ క్లిక్ కు ఫండింగ్ ఎక్కడినుంచి వస్తుందనే విషయమై దిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు న్యూస్ క్లిక్ తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై పోలీసులు దాడి చేయడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని వివరాలతో వెల్లడిస్తామంటూ ట్వీట్ చేసింది. న్యూస్ క్లిక్ పై దాడులు విపక్ష కూటమి ఇండియా నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడే వారి గళాన్ని అణచివేసేందుకు కేంద్రం సోదాలు చేసిందని విమర్శించారు. బీహార్ లో కుల గణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్రం న్యూస్ క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి.

న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయి అంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ లో కథనం ప్రచూరితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నివిల్ రాయి సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్న న్యూస్ క్లిక్ నిధులు పొందినట్లు అందులో రాశారు.

#police #delhi #arrest #prabir-purkayastha #founder #news-click #editor-in-chief
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe