Henna : జుట్టు(Hair) ను సంరక్షించుకోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు దృఢంగా ఉండేందుకు హెన్నాను జుట్టుకు రాసుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే హెన్నాను జుట్టుకు రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?, ఎలాంటి నష్టాలు ఉంటాయో వాలిటి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హెన్నా వల్ల ప్రయోజనాలు:
హెన్నా జుట్టును అందంగా మార్చడమే కాకుండా కుదుళ్లను బలపరుస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు మెరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడం(Hair Loss) సమస్య ఉంటే హెన్నాను ఉపయోగించవచ్చు. హెన్నాను జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు(Dandruff) తో బాధపడేవారికి చాలా మేలు జరుగుతుంది. ఇతర రసాయనాల కంటే ఇది సురక్షితం అని వైద్యులు కూడా చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కొందరికి హెన్నా(Henna) వాడటం వల్ల అలర్జీలు వస్తాయి. కాబట్టి హెన్నాను మొదటిసారి అప్లై చేస్తుంటే ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. హెన్నాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు రంగు త్వరగా మారుతుంది. క్రమంగా జుట్టు నాణ్యతపై ప్రభావం పడుతుంది. జుట్టుకు నాణ్యమైన హెన్నాను మాత్రమే పూయడానికి ప్రయత్నించాలని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. హెన్నా కొందరి జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే కొంతమందికి అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మొదటిసారి హెన్నా రాస్తుంటే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో హెన్నాను జుట్టుకు రాస్తే మాత్రం కుదుళ్లు బలహీనపడి జుట్టు ఊడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దేనితో పడితే దానితో కలిపి హెన్నాను రాసుకోకూడదని, హెన్నా పెట్టిన తర్వాత కెమికల్ ఉన్న షాంపూలతో తలస్నానం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జీలకర్రతో ఎంతటి గ్యాస్ ట్రబులైనా పరార్.. మలబద్ధకం మాయం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.