Varun-Lavanya Marriage: మెగా ప్రిన్స్ పెళ్ళి వచ్చేది ఆ ఓటీటీలోనేనా...

ఈనెల 1న వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుబం స‌ప‌రివార స‌మేతంగా హాజ‌రైంది. లిమిటెడ్ పీపుల్ మధ్యలో జరిగిన ఈ పెళ్ళి ఇప్పుడు అన్ లిమిటెడ్ గా చూడొచ్చు. మెగాప్రిన్స్ పెళ్ళి వీడియోను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం.

New Update
Varun-Lavanya Marriage:పెళ్ళి వీడియో అమ్ముకోలేదు..క్లారిటీ ఇచ్చిన వరుణ్ టీమ్

Varun-Lavanya Marriage Video on Netflix: మెగా ప్రిన్స్ పెళ్ళి సొట్టబుగ్గల లావణ్యతో ఘనంగా జరిగింది. ఎప్పటి నుంచో దీని గురించి కలలు కన్న ఆ జంట దానికి తగ్గట్టుగానే గ్రాండ్ గా పెళ్ళి చేసుకున్నారు. తమకు నచ్చినట్టు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని మురిసిపోయారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్లో తెగ తిరిగాయి. తెలుగు సినిమా అభిమానులు ఫోటోలు చూసి ఆనందించారు కూడా. అయితే ఇప్పుడు పెళ్ళి వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ... పెళ్ళి వీడియో ప్రద‌ర్శన హ‌క్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధ‌రకు కొనుగోలు చేసిందనన్న వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయ‌ల‌కు వరుణ్-లావణ్య పెళ్ళి వీడియోను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. అయితే ఈ విష‌యం ఇంకా అధికారికంగా బ‌య‌ట‌కు రాలేదు. అదే నిజ‌మైతే కనుక మెగా అభిమానులంతా మొత్తం వివాహవేడుకను ఎంచక్కా నెట్‌ఫ్లిక్స్ లో చూసేయొచ్చును.

Also Read: నవంబర్ 17 వరకు ఎంజాయ్ చేయండి..బెట్టింగ్ ఆరోపణలను తిప్పి కొట్టిన బఘేల్

ఇటీవ‌లి కాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌లు ఫ్యాషన్ అయిపోయాయి. ముందు ఇలాంటి పెళ్ళి చేసుకోవడం...తరువాత దాన్ని ఓటీటీలకు అమ్ముకోవడం...ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. సెల‌బ్రిటీల పెళ్ళిళ్ళకు ఉన్న డిమాండ్ నేప‌థ్యంలో ఓటీటీలు కూడా పోటీ ప‌డి మ‌రీ ఫుటేజీని కొంటున్నాయి. అయితే ఇది ఎక్కువ‌గా బాలీవుడ్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ తెలుగుతెరకు కూడా పాకింది. ఇంతకు ముందు సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు టీవీల్లో ఇచ్చేవారు. న్యూస్ ఛాన్ఎల్స్ ఈ హక్కుల కోసం పోటీ పడేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఓటీటీలు (OTT) వచ్చేశాయి. పోటీలు పడి మరీ వెడ్డింగ్, ఇంకా ఇతర ఫంక్షన్ వీడియోలను కొనుక్కుంటున్నాయి. సెలబ్రిటీల క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయి.

Also Read: Bigg Boss 7 Telugu Promo - నాన్న ఏడవకు.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు..!

Advertisment
తాజా కథనాలు