Karnataka Bjp Mla:దేశానికి తొలి ప్రధాని నేతాజీ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే

బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla) మాత్రం భారత తొలి ప్రధాని నెహ్రు కాదు..నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(Subhash Chandrabose) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బ్రిటీష్‌ (British) వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ భయాన్ని నింపారు..

New Update
Karnataka Bjp Mla:దేశానికి తొలి ప్రధాని నేతాజీ అంటున్న బీజేపీ ఎమ్మెల్యే

భారత దేశం తొలి ప్రధాని(First prime minister) ఎవరంటే..ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో చేరిన చిన్నారులు అయిన టక్కున చెప్పే సమాధానం ..జవహార్‌ లాల్‌ నెహ్రు అని. కానీ కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla) మాత్రం భారత తొలి ప్రధాని నెహ్రు కాదు..నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(Subhash Chandrabose) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బ్రిటీష్‌ (British) వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ భయాన్ని నింపారు..అందుకే వారు భారత్‌(Bharat) ను వదిలిపోయారంటూ చెప్పుకొచ్చారు. కర్ణాటక కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్‌ యత్నాల్(Basanagouda patil Yatnal) ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఓ సభలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు(Nehru) కాదు అని పేర్కొన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ భారత్‌ కి తొలి ప్రధాని సుభాష్‌ చంద్రబోస్‌ అని పేర్కొన్నారు.

బ్రిటీష్‌ వారిలో నేతాజీ భయాన్ని నింపారు. అందుకే వారు భారత్‌ ను వదిలి వెళ్లిపోయారని చెప్పారు. దీని గురించి బాసనగౌడ మాట్లాడుతూ... ''బాబా సాహెబ్‌ ఓ పుస్తకంలో ఇలా రాసుకోచ్చారు. మనకు స్వాతంత్య్రం తీసుకుని వచ్చే క్రమంలో నిరాహార దీక్షలు చేసినందుకు రాలేదని, ఒక చెంప పై కొడితే మరో చెంప చూపినందుకు రాలేదని తెలిపారు. నేతాజీ వారిలో అణువణువున భయాన్ని నింపారు. అందుకే మనకు స్వాతంత్య్రం వచ్చిందని వివరించారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటీష్‌ వాళ్లు దేశం విడిచి పారిపోయారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు స్వేచ్ఛను ప్రకటించినప్పుడు స్వతంత్ర భారత్ కు తొలి ప్రధాన మంత్రిగా సుభాష్‌ చంద్రబోస్ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకే నెహ్రూ మన దేశ తొలి ప్రధాని కాదని, నేతాజీ సుభాశ్ చంద్రబోసే తొలి ప్రధాని అని అంటుంటారు’ పాటిల్ యత్నాల్ వివరించారు.

బాసనగౌడ పాటిల్ యత్నాల్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆరేడు నెలల్లో కూలిపోతుందని గత నెలలో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు