Kidney Disease: ఈ సమస్యలను లైట్ తీసుకుంటే కిడ్నీలు పోయే ప్రమాదం కిడ్నీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. కిడ్నీ రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు శరీరంలోని మలినాలు బయటకు రావు. చాలా మంది సరైన సమయంలో ఇలాంటివి గుర్తించలేకపోతున్నారు. మూత్రపిండాల వ్యాధి విషయంలో ఎక్కువగా లక్షణాలు కనిపించవు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం By Vijaya Nimma 09 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Kidney Disease: ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. చాలా మంది సరైన సమయంలో గుర్తించకపోవడంతో కిడ్నీలను కోల్పోవాల్సి వస్తోంది. అయితే మూత్రపిండాలు దెబ్బతినడానికి ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. మూత్రపిండాల వ్యాధి విషయంలో ఎక్కువగా లక్షణాలు కనిపించవని నిపుణులు అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రుతుక్రమం విషయంలో మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కిడ్నీ ఫెయిల్ అయితే ఏమవుతుంది? కిడ్నీ విఫలమైనప్పుడు రక్తంలో విషపదార్ధాలు క్రమంగా పేరుకుపోతాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు చాలా త్వరగా అలసిపోతారు. అదే సమయంలో కొంచెం నడిచిన తర్వాత కూడా బలహీనంగా అనిపిస్తుంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి రక్తహీనత, అలసట ఉంటుంది. కిడ్నీ రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు శరీరంలోని మలినాలు బయటకు రావు. దీని వల్ల నిద్రలేమి, ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వస్తుంది. ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? మూత్రపిండాలలో ఖనిజాలు, పోషకాల లోపం ఉన్నప్పు చర్మం పొడిబారడంతో పాటు దురద కూడా మొదలవుతుంది. ఏ రకమైన మూత్రపిండ వ్యాధిలోనైనా మూత్రంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం కిడ్నీ వ్యాధికి సంకేతం. మూత్రంలో రక్తం రావడం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు వచ్చే ఆహారాలను తీసుకోకూడదు. ఎక్కువగా నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్ చేసి తాగితే మంచిదా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #kidney-disease #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి