NEET: ఈనెల 23న వారికి మళ్ళీ నీట్ పరీక్ష..జూన్ 30న ఫలితాలు

డాక్టర్ చదువు కోసం నిర్వహించే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1563మందికి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ నెల 23న వారికి ఎగ్జామ్ నిర్వహించనుంది.

NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా..
New Update

NEET Exam : నీట్ పరీక్ష, ఫలితాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల విడుదలైన నీట్ రిజల్ట్‌లో ఏకంగా 67 మంది ఫ్టస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారి తీసింది.దీనిలో ఎనిమిది మందిది ఒకే పరీక్షా కేంద్రం కావడం గమనార్హం. దీంతో పాటూ కొందరు విద్యార్ధులకు అదనపు మార్కులు రావడం లాంటి విషయాలు కూడా కూడా అనుమానాలను రేకెత్తించింది. దీంతో నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం ఈ పరీక్ష మీద ఒక నిర్ణయం తీసుకుంది. సమయం కోల్పోయి గ్రేస్ మార్కులు పొందిన విద్యార్ధులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 23న మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి జాతీయ పరీక్షల సంస్థ షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. జూన్ 23 ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష నిర్వహించనుంది. ఇక ఫలితాలను కూడా ఇదే నెలలో విడుదల చేయాలని భావిస్తోంది. జూన్ 30న రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ తెలిపారు.

అంతకుముందు మే5 న దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 24 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. అయితే వీటి రిజల్ట్‌లో అవతవకలు వచ్చాయి. దీంతో విద్యార్ధుల భవిత ప్రమాదంలో పడిందంటూ కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ప్రశ్నపత్రం లీకైనట్లు ఎక్కడా ఆధారాల్లేవన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Also Read:Khammam: ట్రైన్ సిగ్నల్స్ ట్యాంపరింగ్..పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ

#grace-marks #exam #central #neet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe