Kota : కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 48 గంటల్లో రెండోది!

దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా ..ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. కేవలం 48 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సారీ నాన్న అంటూ మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని మరణించాడు.

Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..
New Update

Student Suicide : దేశంలో పోటీ పరీక్షలకు(Competition Exams) కేంద్రంగా మారిన కోటా(Kota).. ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యల(Suicide) కు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. కేవలం 48 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సారీ నాన్న అంటూ మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని మరణించాడు.
మృతి చెందిన విద్యార్థిని పోలీసులు భరత్‌ కుమార్ రాజ్‌పుత్‌గా గుర్తించారు.

భరత్‌ కుమార్ రాజ్‌పుత్ గత కొంతకాలంగా నీట్ పరీక్ష(NEET Exam) కోసం సిద్దమవుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు నీట్‌ పరీక్షకు హాజరయ్యాడు. తన బంధువు రోహిత్‌తో కలిసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. కాగా, మే 5న మరోసారి అతడు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం 10.30 సమయంలో రోహిత్ ఏదో పనిమీద బయటకు వెళ్లగా భరత్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గంట తరువాత తిరిగొచ్చిన రోహిత్‌కు తన గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించాడు. కిటిలోకి తొంగి చూడగా భరత్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.

విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు భరత్ ఓ ఆత్మహత్య లేఖను కూడా రాసినట్టు పోలీసులు తెలిపారు. ‘‘సారీ నాన్నా, ఈ సంవత్సరం నేను సక్సెస్ కాలేకపోయాను’’ అని భరత్ లేఖలో పేర్కొన్నాడు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో భరత్ తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే!

#rajasthan #neet-exam #student-suicide #kota
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి