KTR: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం తమకు రూ.లక్ష కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వార్తపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవని అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండే ప్రాంతీయ పార్టీలు మాత్రమే తెలంగాణకు రక్షణగా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని దగ్గరి నుంచి చూస్తున్నారని ఆశిస్తున్నానని.. తెలంగాణకు సొంత రాజకీయ గుర్తింపు ఉండటమే ఉత్తమమని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..TG-AP: చంద్రబాబును మెచ్చుకున్న కేటీఆర్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని రూ.లక్ష కోట్లు డిమాండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
Translate this News: