TG-AP: చంద్రబాబును మెచ్చుకున్న కేటీఆర్.. ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని రూ.లక్ష కోట్లు డిమాండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. By B Aravind 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి KTR: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం తమకు రూ.లక్ష కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వార్తపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవని అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండే ప్రాంతీయ పార్టీలు మాత్రమే తెలంగాణకు రక్షణగా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని దగ్గరి నుంచి చూస్తున్నారని ఆశిస్తున్నానని.. తెలంగాణకు సొంత రాజకీయ గుర్తింపు ఉండటమే ఉత్తమమని పేర్కొన్నారు. This is how you get your way in Delhi. By voting for strong regional parties which can deliver the goods I hope people of Telangana are watching closely 👇 స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష https://t.co/7PqF2nBcQj — KTR (@KTRBRS) July 11, 2024 Also Read: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు! మరోవైపు.. గురువారం బీఆర్‌ఎస్ విద్యార్థి నాయకులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. మహబూబ్‌నగర్ మీటింగ్‌లో విద్యార్థులను, నిరుద్యోగ యువతను అవమానించిన రేవంత్.. వాళ్లకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు.. 50 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 6 వేల అదనపు పోస్టులు మాత్రమే ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మొత్తం 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ అన్నారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా కేటీఆర్ లేఖ రాశారు. చేనేత కార్మికుల ప్రయోజనం కోసం సిరిసిల్లాకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ తీసుకువచ్చేలా చేయాలని కోరారు. అలాగే త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించేలా బండి సంజయ్ కృషి చేయాలన్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచ్ న్యాయ్ డాక్యుమెంట్ ప్రకారం.. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాలను పటిష్ఠం చేయాలంటూ డిమాండ్ చేశారు. ♦️ ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకురండి ♦️ కేంద్రమంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బహిరంగ లేఖ ♦️ పదేళ్లుగా ప్రతి బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది ♦️ అనేకసార్లు పవర్‌లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు… pic.twitter.com/Gc1VCfn7VY — BRS Party (@BRSparty) July 11, 2024 Also Read: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్! #brs #ktr #chandrababu-naidu #telangana #tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి