ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు
New Update

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మొరంచపల్లి గ్రామంలో వరద నీటిలో  చిక్కుకున్న  ఏడుగురు   బాధితులను  రక్షించేందుకు  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లలేకపోవడంతో ముందుగా మొరంచపల్లికి  చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (ndrf) బృందాలు హెలికాఫ్టర్ల (Helicopters)సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.   బుధవారం   భారీ వర్షం కురవడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండిపోయారు.  వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది.  భయాందోళనకు గురైన స్థానికులు తమను కాపాడాలని అధికారులను వేడుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తుండటంతో వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లాలో (Mulugu District) భారీ వర్షం కురుస్తుండటంతో జిల్లాలోని అనేక గ్రామాల్లో వరద ముంచెత్తింది.  కొందరు ఇంటి పైకప్పుపై తలదాచుకుంటే, మరికొందరు చెట్లపై బిక్కుబిక్కు మంటూ గడిపారు.

కేటీఆర్ సమీక్ష

ములుగు జిల్లాలో వరద ప్రభావంపై మంత్రి కేటీఆర్‌ (ktr)   అధికారులతో సమీక్షించారు. తక్షణమే వరదల్లో చికుక్కున్న వారిని రక్షించాలని, దానికోసం ఆర్మీ హెలికాఫ్టర్లు (Army helicopters) ఉపయోగించాలని   ఆదేశించారు. దీంతో ముందుగానే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ (ndrf) బృందాలు వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న హెలికాఫ్టర్ల ద్వారా  సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు అండగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

పడవలు, లైఫ్ జాకెట్ల సాయంతో...

వరద ప్రభావిత గ్రామాల్లో ఉండిపోయిన వారికోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇళ్లలోకి వరద నీరు వెళ్లిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. అక్కడ ఉన్న వరద పరిస్థితిని బట్టి పడవలు (boats), లైఫ్‌ జాకెట్ల (Life jackets) సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. బయటకు వచ్చిన వారు చెట్ల క్రింద ఉండవద్దని, విద్యుత్‌ సంభాలను ముట్టుకోవద్ద, నీరు అధికంగా నిల్వ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వరద ఉధృతి వస్తే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

#victims #cm-kcr #mulugu #flood #ndrf #helicopter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe