/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-09T191840.486.jpg)
కేంద్ర కేబినెట్ పదవులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గం అంసతృప్తి వ్యక్తం చేస్తోంది. కేబినేట్‌లోకి ప్రఫుల్ పటేల్ పేరును ఎన్సీపీ సూచించింది. కానీ బీజేపీ ప్రఫుల్‌కు సహాయమంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేసింది. గతంలోనే తాను కెబినేట్ మంత్రిగా పనిచేశానన్న ప్రఫుల్ పటేల్.. ఈసారి సహాయ మంత్రి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమోషన్ కాదు డిమోషన్ అంటూ వాపోయారు. అయితే కొన్ని రోజుల పాటు వేచిచూడాలని.. భవిష్యత్‌లో అవకాశం ఇస్తామని బీజేపీ పెద్దలు ప్రఫూల్‌కు సూచించారు.