Tamannah: బాలయ్య సరసన తమన్నా..కానీ హీరోయిన్‌ గా కాదు!

బాలకృష్ణ కొత్త సినిమా ఎన్‌బీకే 109 లో మాస్‌ ప్రేక్షకులను ఆలరించేందుకు స్పెషల్‌ ఐటమ్‌ సాంగ్‌ లో ఆడి పాడేందుకు తమన్నా అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ బాబీ రూపొందిస్తున్నారు.

New Update
Tamannah: బాలయ్య సరసన తమన్నా..కానీ హీరోయిన్‌ గా కాదు!

నందమూరి బాలకృష్ణ(Balakrishna)  గతేడాది హిట్ల మీద హిట్లు కొట్టి ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు. గతేడాది సంక్రాంతి (Pongal) కానుకగా విడుదలైన వీరసింహరెడ్డి (Veerasimha reddy) ప్రేక్షకుల ఆదరణ పొంది హిట్‌ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన భగవంత్‌ కేసరి  (Bhagavanth kesari) కూడా అటు మాస్‌, క్లాస్‌ ప్రేక్షకులను ఆలరించి సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

ఈ జోష్‌ లోనే బాలయ్య తన కొత్త సినిమా షూటింగ్‌ ని ప్రారంభించేశారు. ఈ చిత్రాన్ని వాల్తేరు వీరయ్య డైరెక్టర్‌ బాబీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి ఎన్‌బీకే 109  (NBK 109) అనే వర్కింగ్‌ టైటిల్‌ ని పెట్టారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ కి తగినట్లు గానే ఈ సినిమా మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌ లో కనిపించనున్నారని టాక్‌. దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు. అయితే బాబీ తీసే ప్రతి సినిమాలోనూ మాస్‌ ప్రేక్షకుల కోసం ఎప్పుడూ కూడా ఓ రేంజ్‌ లో మసాలా ట్రీట్‌ ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయిన వాల్తేరు వీరయ్యలో మసాలా సాంగ్‌ తో ఏ రేంజ్‌ లో సందడి చేశాడో మనకు తెలిసిందే.

ఆ ఊపుతోనే బాలయ్య సినిమా కోసం కూడా అదే రేంజ్‌ లో ఓ మసాలా ఐటమ్‌ సాంగ్‌ ను రూపొందిస్తున్నాడు. బాబీ ఇంతకు ముందు సినిమా అయిన జై లవకుశ లో తమన్నా తో స్వింగ్‌ జర అంటూ ఆడి పాడించాడు. అయితే ఇప్పుడు ఆ బ్యూటీని బాలయ్య కోసం ఎన్‌బీకే 109లో కూడా ఆడేందుకు ఒప్పించాడు.

బాలయ్యతో స్పెషల్ సాంగ్‌ చేసేందుకు తమన్నా కూడా జెండా ఊపిందని సమాచారం. ఈ ఎన్‌బీకే 109 సినిమాని సితార బ్యానర్‌ పై సూర్య దేవర నాగవంశీ, ఎస్‌ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్‌ లోనే ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాల్లో సస్పెన్స్ నడుస్తోంది.

ఈ సినిమా హీరోయిన్‌ ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోసారి సంక్రాంతికి బిగ్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అవుతున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Also read: నిరుద్యోగులకు శుభవార్త…జనవరి 1 నుంచి రూ. 3వేల నిరుద్యోగ భృతి..ఈ అర్హతలు ఉండాల్సిందే..!!

Advertisment
తాజా కథనాలు