Nayanthara: నయనతార విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భర్త విఘ్నేష్ ..! స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ వైరలయ్యాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ.. నయన్ భర్త విగ్నేషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండ్ ట్రెండ్ అవుతోంది. By Archana 04 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nayanthara - Vignesh Shivan Divorce Rumours: టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయన్.. హీరోలతో సమానంగా క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయన్.. 2022లో స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంత స్టార్ డమ్ వచ్చిన సోషల్ మీడియాకు దూరంగా ఉండే నయన్.. ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. Also Read: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..? పెళ్లి తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన నయన్ (Nayanthara).. అప్పుడప్పుడు తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె భర్త విఘ్నేష్ ను ఇన్స్టా లో అన్ ఫాలో చేయడంతో రకరకాల రూమర్స్ వైరలయ్యాయి. నయన్, విఘ్నేష్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా తెగ ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు నయన్ భర్త విఘ్నేష్ . ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. విడాకుల పై విఘ్నేష్ శివన్ క్లారిటీ కొన్ని రోజుల క్రితం నయనతార స్కిన్ కేర్ బ్రాండ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బ్రాండ్ కు ఒక అవార్డు దక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విఘ్నేష్. దీంతో నయన్, విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్ కు చెక్ పడింది. ఇది చూసిన నయన్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేవలం సాంకేతిక లోపం కారణంగానే విఘ్నేష్ కనిపించలేదని చెబుతున్నారు. Manchu Manoj: “నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్”.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్ #vignesh-shivan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి