Ship Hijacked :హైజాక్ కు గురైన నౌకలోని సిబ్బందిని కాపాడిన నావికాదళం!

అరేబియా సముద్రంలో సోమాలియా తీరంలో హైజాక్‌ కు గురైన షిప్‌ లోని భారతీయులతో పాటు ఇతర సిబ్బందిని భారత నావికాదళం రక్షించింది. నౌక హైజాక్‌ కు గురైన సమాచారం అందుకున్న వెంటనే భారత నేవీ స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన సిబ్బంది అందర్ని రక్షించారు.

Ship Hijacked :హైజాక్ కు గురైన నౌకలోని సిబ్బందిని కాపాడిన నావికాదళం!
New Update

Ship Hijack: అరేబియా మహాసముద్రంలో (Arabian Sea) సోమాలియా (Somalia) తీరంలో హైజాక్‌(Hijack) గురైన ఎంవీ లీలా నార్‌ఫోక్‌ నౌకలోని 15 మంది భారతీయులతో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. వారందరినీ కూడా భారత నేవీ కమాండోలు కాపాడారు. నౌక హైజాక్‌ కు గురైన సమాచారం అందుకున్న వెంటనే భారత నేవీ స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన సిబ్బంది అందర్ని రక్షించారు.

నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగల పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత నౌకాదళ చీఫ్‌ అడ్మిరల్‌ హరి కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నౌకలపై దాడులను నిరోధించడానికి నావికాదళానికి చెందిన నాలుగు యుద్ద నౌకలను అరేబియా సముద్రంలో మోహరించారు.

అరేబియా మహాసముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. సోమాలియా తీరానికి దగ్గరలో ఈ షిప్‌ను హైజాక్ చేశారు. నిన్న సాయంత్రం ఇది జరిగిందని తెలుస్తోంది. హైజాక్ చేసిన ఓడ మీద లైబీరియా జెండా ఉంది. ఎమ్వీ లీలా నార్‌పోక్ అనే కార్గో షిప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేసినట్టు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్‌ తెలిపింది. నిన్న సాయంత్రం 5 లేదా ఆరు మంది గుర్తు తెలియని సిబ్బంది ఓడ ఎక్కారని తరువాత దానిని తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. వీరి దగ్గర ఆయుధాలున్నాయని కూడా చెప్పింది. ఈ షిప్‌లో 15 మంది దాకా భారతీయులు ఉన్నారు.

షిప్ హైజాక్ సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే స్పందించింది. సముద్రగస్తీ కోసం కేటాయించిన ఐఎన్ఎస్ చెన్నైను రంగంలోకి దించింది. దీంతో పాటూ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా పంపించింది. ఐఎన్ఎస్ యుద్ధనౌక కార్గో షిప్ దగ్గరగా మూవ్ అవుతూ నిశితంగా పరిశీలిస్తోంది. నౌకా సిబ్బందితో కమ్యూనికేషన్‌ను ఏర్పరుచుకుంది. షిప్‌లో ఉన్న భారతీయులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇడియన్‌ నేవి ఎయిర్‌ క్రాఫ్ట్ సాయంతో హైజాక్‌ అయిన షిప్‌ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు తెలిపారు.

అరేబియా సముద్రంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ భారత్ నౌకాదళం తన నిఘాను పెంచింది. ఈ వారం మొదటిలో చాలా మంది చేపలు పట్టేవారు ఓడను ఎక్కారని భారత నౌకాదళం అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కారణంగా ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.

Also read: వైసీపీకి మరో షాక్‌..పార్టీని వీడనున్న మాగుంట!

#somalia #indian-navy #ship-hijack #arebian-sea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe