Natty Kumar: ఈ ఇండస్ట్రీకి ఏమైంది.. ఎవ్వరూ మాట్లాడరేంటి..! చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు నట్టి కుమార్. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరం అన్నారాయన. By Jyoshna Sappogula 13 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Natty Kumar: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ పై తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల నిర్మాత నట్టి కుమార్ విచారం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని. తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు.అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబునాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉంటే మంచిదని బావిస్తుంటాను." చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు నట్టి కుమార్. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరం అన్నారాయన. "చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం నాకు చాలా భాధను కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) సహా చిరంజీవి (Chiranjeevi) ,మురళీమోహన్, అశ్వనీదత్, రాజమౌళి, దామోదరప్రసాద్ వంటి సినీ ప్రముఖులతో పాటు తుమ్మల ఇంటి పేరును నందమూరి లాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ కానీ ఇతర సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించకపోవడం దారుణం. . వాస్తవానికి పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ అనే పేరుంది. వీళ్ళు అంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాకు ఇవి కావాలి!...అవి కావాలి! అని లబ్ది పొందిన వారే." చంద్రబాబుకు మద్దతు తెలిపితే, జగన్ ఉరితీస్తారా అని ప్రశ్నించాడు నట్టికుమార్. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడడం మానవత్వం కిందకు వస్తుందని, దాన్ని రాజకీయం చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. బహిరంగంగా చంద్రబాబుకు మద్దతిచ్చి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిజమైన హీరో అనిపించుకున్నారని, సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు నట్టి కుమార్. Also Read: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. లోకేష్‌కి ఫోన్ చేసిన రజనీకాంత్ #chandrababu #chiranjeevi #ntr #telugu-cinema-industry #natty-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి