Indira Gandhi: అర్ధరాత్రి టార్చ్‌లైట్ వెలుతురులో 15 నిమిషాలు ప్రసంగించిన ఇందిరా గాంధీ!
లోక్ సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి సంబంధించిన ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. 1980 మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టార్చ్ లైట్ వెలుతురులో ఆమె 15 నిమిషాలు ప్రసంగించారు. ఇది ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.