Breaking : ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో.. 8 మంది మృతి!
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.
ప్రధాని మోదీ ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఈయనకు పోటిగా.. అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం).. ప్రముఖ ట్రాన్స్జెండర్, శ్రీకృష్టుడి పరమ భక్తురాలు 'మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా' ను ప్రధాని మోదీపై తమ అభ్యర్థిగా నిలబెట్టింది.
ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ నేటితో ముగియనుంది. ఈరోజు ఉదయం 11.00AM గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. మరో 14 రోజుల పాటు ఆమె జ్యూడీషియల్ రిమాండ్ పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈడీ తనను అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించడంపై ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ పిటిషన్పై విచారణ జరపనున్న న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పిల్లలు జీవితంలో లేదా కెరీర్లో ఏదైనా మంచి జరిగినప్పుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా పెరిగిన తర్వాత, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తే అది వారికి భావోద్వేగ క్షణం అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఅలాంటి వీడియో మీరూ చూడండి.
ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయన బెదిరింపులకు తాము భయపడమంటూ హెచ్చరించారు.
ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ Bot పై సైబర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడిలో, కంపెనీకి చెందిన 75 లక్షల మందికి పైగా కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. లీక్ అయిన డేటాలో వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, కస్టమర్ ఐడీలు, అడ్రెస్ లు ఉన్నాయి.
రాజస్థాన్ అగ్దావా ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ వద్ద భద్రతా లోపం బయటపడింది. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా C295 విమానం ల్యాండింగ్ అవగానే అకస్మాత్తుగా ఒక ఎద్దు ఎయిర్ స్ట్రిప్పైకి దూసుకొచ్చి గందరగోళం సృష్టించింది. భద్రతా సిబ్బంది, కమాండోలు భయాందోళనకు గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది.