Kejriwal : తల్లి కాళ్లకు నమస్కరించిన కేజ్రీవాల్
కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు.
కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు.
బీజాపూర్ పిడియా అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్గడ్ సీఎం విష్ణుదేవ్ ప్రకటించారు
తెలంగాణలో RR ట్యాక్స్‌పై చర్చ జరుగుతోందని అన్నారు మోదీ. RR ట్యాక్స్ పై తాను ఎవరు పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. RR కాదు RRR ట్యాక్స్ నడుస్తోందని.. మూడో R అంటే రజాకార్ ట్యాక్స్ అని పేర్కొన్నారు.
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది.
ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏపీకి రాబోతున్నారని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఆయన ముందుగా కడపజిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పిస్తారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని.. ఇద్దరు భార్యలు ఉన్నవారికి రూ. 2 లక్షలు అందజేస్తాం అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
బీజాపూర్‌లో మళ్ళీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన కేసులో బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది.
మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.