PM Modi: కొడుకు కోసం సోనియా గాంధీ ఓట్లు అడుగుతున్నారు.. ప్రధాని మోదీ ఫైర్
సోనియా గాంధీ కోవిడ్ తర్వాత ఒక్కసారి కూడా తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీని సందర్శించలేదని అన్నారు మోదీ. ఇప్పుడు ఆమె తన కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. వారు రాయ్‌బరేలీ సీటును తమ కుటుంబ ఆస్తిగా భావిస్తారని చురకలు అంటించారు.
Kangana Ranaut: ఆ అవార్టు వస్తే సంతోషం: కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్‌లో మండీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రౌనత్ రంగంలోకి కీలక వ్యాఖ్యలు చేశారు. మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని అన్నారు. 'ఎంపీ ఆఫ్ ద ఇయర్ అవార్డు' వస్తే చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు.
Boat Capsized: గంగా నదిలో పడవ బోల్తా ఇద్దరు రైతులు గల్లంతు
బీహార్‌లోని మానేర్ జిల్లా మహావీర్ తోలా గ్రామంలో ఈరోజు ఉదయం గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. కాగా బోటులో మొత్తం 12 మంది రైతులు ప్రయాణించినట్లు చెప్పారు. అందులో ఇద్దరు గల్లంతు అయ్యారని.. మిగతా వారు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు.
AAP : ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ కార్యాలయం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.
INDIA : ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు!
పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సంయమనం పాటించమని చెప్పినా కూడా అంగీకరించనన్నారు. మల్లికార్జున ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా కార్యకర్తలవైపే మాట్లాడుతానన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1000 ఫైన్
రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు రూ.1000 జరిమానా విధించింది. అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో జారీ చేయబడిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నిర్ణీత గడువులోగా తన స్పందనను దాఖలు చేయనందుకు ఆయనకు ఫైన్ విధించింది.
CM Kejriwal: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తరువాత తమ పార్టీలోని ముఖ్యనేతలను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అలాగే తమ పార్టీ లేకుండా చేసేందుకు పార్టీ ఖాతాలను సీజ్ చేసేందుకు ఈడీ సిద్ధమైందని తెలిపారు.
Patanjali's soan papdi: నాణ్యత పరీక్షలో పతంజలి ‘సోన్ పాప్డి’ ఫెయిల్
నాణ్యత పరీక్షలో పతంజలి ఆహార ఉత్పత్తు సంస్థకు చెందిన సోన్ పాప్డి ఫెయిల్ అయింది.దీంతో ఆ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి పిథోరఘర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. పతంజలి సోన్ పాప్డిని బ్యాన్ చేశారు.