పాదచారులకు సుప్రీం కోర్టు షాక్.. అక్కడ నడవొద్దని వార్నింగ్
హైవేలపై నడిచే పాదచారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్ను కొట్టేసింది. దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనలో క్రమశిక్షణ పెరగలేదని హితవు పలికింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కోర్టు సమర్థించలేదని స్పష్టం చేసింది.