Drugs: ఛీ..ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా.. డ్రగ్స్ కోసం బిడ్డల్ని అమ్ముకున్నారు..
మహారాష్ట్రలోని ముంబయిలో డ్రగ్స్‌కు బానిసైన దంపతులు తమ రెండేళ్ల కొడుకు, నెల రోజుల వయసున్న పసిపాపను అమ్ముకున్నారు. వీరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దంపతులను, పసిపాపను కొనుక్కున్న వ్యక్తిని, డ్రగ్స్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు.