ఉత్తరాఖండ్ సిల్క్ యారా టన్నెల్ లో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారు లోపలుండగా టన్నెల్ మూసుకుపోయింది. పన్నెండు రోజులుగా వారిని బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంది. నిజానికి వాళ్ళు నిన్న రాత్రే బయటకు రావాలి కానీ దేనితో అయితే సొరంగాన్ని తవ్వుతున్నారో దానికే ప్రాబ్లెమ్ రావడంతో డ్రిల్లింగ్ పనులను ఎక్కడిక్కడే ఆపేశారు. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ అవదు. ఎలా పెడితే అలా డ్రిల్లింగ్ చేస్తే అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు.
Also Read:ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్.. ఇలా చేస్తే డబ్బులు మిగులుతాయి..
డ్రిల్లింగ్ ను మళ్ళీ ప్రారంభించడానికి ఏర్పాట్ఉ చేస్తున్నారు. మరోవైపు సొరంగంలో అమర్చిన పైపులో స్ట్రెచర్ ద్వారా కార్మికులను ఎలా తీసుకురావాలి అన్న దాని మీద ఎన్టీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఇందులో 800 800 ఎమ్‌ఎమ్ వెడల్పు ఉన్న పైపు ద్వారా చక్రాలు ఉన్న స్ట్రెచర్‌ను లోపలికి పంపుతారు. పైపుకు ఇంకో వైపు ఉన్న కార్మికులు దాని మీద బోర్లా పడుకుంటే బయటకు లాగుతారు. తర్వాత వారిని నేరుగా ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను ఒక మనిషిని లోపలికి పంపి మరీ టెస్ట్ చేవారు. ఇది విజయవంతంగా అయింది.
NDRF demonstration of the trapped men will be brought out of the Silkyara tunnel in Uttarkashi. 41 tunnel workers have been trapped inside the tunnel since the past 13 days. #SilkyaraTunnel pic.twitter.com/Df4bLpvQqa
— Saurabh Sharma (@saurabhsherry) November 24, 2023
మరోవైపు లోపల ఉన్న కార్మికులు ఒత్తిడి అధిగమించకుండా ఉండేందుకు లూడో లాంటి బోర్డ్ గేమ్స్ ను పంపిస్తున్నారు. ప్రస్తుతానికి లోలపల ఉన్నవారంతా బాగానే ఉన్నారని.. యోగా చేస్తూ ఒత్తిడిని అధిగమిస్తున్నారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.