BJP CMs Selection: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక కోసం ముగ్గురు బీజేపీ పెద్దల మేథోమథనం
మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే.. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయడం మరో పెద్ద తతంగంగా మారిపోయింది బీజేపీకి. ఇటువంటి పరిస్థితిలో ఢిల్లీలో ప్రధాని మోదీ తన నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షాలతో మంగళవారం అర్ధరాత్రి దాకా ఈ వ్యవహారంపై చర్చించారు.