200 కిలోల ఉప్పు కుప్పలో చిన్నారుల మృతదేహాలు..ఎందుకంటే!
సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
సోషల్ మీడియాలో చూసిన వీడియో తో తమ పిల్లలు బతుకుతారనకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. అందుకే చనిపోయిన ఇద్దరు బిడ్డలను 200 కేజీల ఉప్పులో దాచిపెట్టారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
మన దేశంలో ఎడ్యుకేషన్ లోన్స్ భారీగా పెరిగాయి. కోవిడ్ సమయంలో 3.1% తగ్గిన ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పుడు భారీగా పెరిగాయి. 2023లో ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఎడ్యుకేషన్ లోన్స్ చేరుకున్నాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలోనే 20.6% వృద్ధి ఎడ్యుకేషన్ లోన్స్ లో ఉంది.
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు రాహుల్.
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఈరోజు శబరిమల ఆలయం మూసివేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆలయంలో మండలపూజ జరగనున్న నేపథ్యంలో రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు అధికారులు మూసివేయనున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటేత్తారు. కేవలం 39 రోజుల్లోనే రూ. 200కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 31లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. అప్పం ప్రసాదం ద్వారా 12.38కోట్లు వచ్చాని ఆలయ అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మోదీని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి మోదీకి నివేదిక ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.