Blast near Israel Embassy : న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..!!

న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

New Update
Tamil Nadu Blast: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

న్యూఢిల్లీ జిల్లాలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్‌లో పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సంఘటన సుమారు ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. స్పెషల్ సెల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రెండేళ్ల క్రితం కూడా  ఇదే ప్రాంతంలో  పేలుడు జరిగింది:
సరిగ్గా రెండేల్ల క్రితం జనవరి 29, 2021 సాయంత్రం ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడుతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ పేలుడు ధాటికి చాలా కార్లు దెబ్బతిన్నాయి.

2012లో కూడా పేలుడు సంభవించింది:
ఇంతకు ముందు కూడా ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో కారుపై దాడి జరిగింది. ఫిబ్రవరి 2012లో ఇజ్రాయెల్ ఎంబసీ కారులో ఈ పేలుడు జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు సఫ్దర్‌జంగ్ రోడ్డులోని ఎంబసీ దగ్గరకు బైక్‌పై వచ్చారు. ఎంబసీకి చెందిన ఇన్నోవా వాహనం అద్దానికి ఏదో అతికించిని... కొద్ది నిమిషాల తర్వాత పేలుడు సంభవించింది.

ఇది కూడా చదవండి: పేటీఎంలో పెండింగ్ చలాన్స్ ఉన్నాయా? అయితే ఇలా సింపుల్ గా చెల్లించండి..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు