/rtv/media/media_files/2025/08/19/maharastra-2025-08-19-12-03-25.jpg)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మహిళా పోలీస్‌ను రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు ఓ ఆటోడ్రైవర్. సతారా సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా భాగ్యశ్రీ జాదవ డ్యూటీ చేస్తుంది. ఈ క్రమంలో మద్యంమత్తులో ఓ ఆటోడ్రైవర్ దూసుకొచ్చాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆటోను పట్టుకొని భాగ్యశ్రీ పడిపోయింది. దీంతో కానిస్టేబుల్‌ను అలాగే 120 మీటర్లు ఈడ్చుకెళ్లాడు ఆటోడ్రైవర్. అంతేకాకుండా పారిపోతూ అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఆటో వెంట పరిగెత్తి డ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు.
WARNING : DISTURBING VISUALS
— Deccan Chronicle (@DeccanChronicle) August 19, 2025
Maharashtra: A drunk auto rickshaw driver dragged a woman cop in Maharashtra's Satara for almost 200 metres.#Maharashtrapic.twitter.com/2LIEon6TbJ
చలానా వేస్తారనే భయంతోనే
ఈ ఘటనలో భాగ్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించగా ఆమెకు చికిత్స అందుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోగా చలానా వేస్తారనే భయంతోనే పారిపోయానంటున్న ఆటోడ్రైవర్ విచారణలో వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసులపై ఇలాంటి దాడులు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.