Who Is Anjana Krishna: డిప్యూటీ సీఎంకు ఝలక్ ఇచ్చిన ఈ IPS ఆఫీసర్ ఎవరు?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో ఫోన్ కాల్ సంభాషణ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ.  సోలాపూర్ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్నప్పుడు,

New Update
ias

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో ఫోన్ కాల్ సంభాషణ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ.  సోలాపూర్ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్నప్పుడు, ఒక స్థానిక నాయకుడు అజిత్ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు. ఫోన్ లో అజిత్ పవార్ వెంటనే చర్యలను ఆపాలని ఆమెను ఆదేశించారు. 

ఆ సమయంలో అజిత్ పవార్ నేరుగా ఫోన్ చేయకుండా, వేరొకరి ఫోన్‌లో మాట్లాడటంతో ఆమె "మీరు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? దయచేసి నా ఫోన్ నంబర్‌కు నేరుగా వీడియో కాల్ చేయండి" అని బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ధైర్యానికి, నిజాయితీకి నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. దీంతో ఎవరీ అంజనా కృష్ణ అనే చర్చ సాగుతోంది.  

ఐపీఎస్ కావాలని కలలు

అంజనా కృష్ణ ప్రస్తుతం షోలాపూర్ జిల్లాలోని కర్మాలాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)గా పనిచేస్తున్నారు. ఆమె 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినది.  అంజనా కృష్ణ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి చిన్నపాటి వస్త్ర వ్యాపారం చేస్తుండగా, తల్లి కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఐపీఎస్ కావాలని కలలు కన్న అంజనా కృష్ణ, యూపీఎస్సీ పరీక్షలో 355వ ర్యాంకు సాధించి తన కలను నిజం చేసుకున్నారు. తాజాగా ఈ ఘటనతో ఆమె వెలుగులోకి వచ్చారు. 

ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ పవార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కూడా చట్టాలకు లోబడే ఉండాలని, ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీని అడ్డుకోవడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై ఎన్సీపీ నేత సునీల్ తట్కరే స్పందించారు. అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అలా మాట్లాడి ఉండవచ్చని వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

Also Read : University Of Otago Scholarship: విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. రూ.23 లక్షల స్కాలర్‌షిప్

Advertisment
తాజా కథనాలు