Adil Thokar : విద్యార్థి వీసాతో పాకిస్థాన్కు.. ఉగ్రవాదిగా మారి భారత్‌కు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని గుర్రే గ్రామానికి చెందిన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో విద్యార్థి వీసాతో పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ ఆరు సంవత్సరాల పాటు  టెర్రరిస్ట్ ​కార్యకలాపాల్లో శిక్షణ తీసుకుని తిరిగి నలుగురు ఉగ్రవాదులతో ఇండియాకు వచ్చాడు.

author-image
By Krishna
New Update
pakistan Adil Thokar

pakistan Adil Thokar

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో ఒక విదేశీయుడు సహా 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడికి సంబంధించి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ గురీ అని కూడా పిలువబడే ఆదిల్ థోకర్‌లను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా పోలీసులు ప్రకటించారు. ఆర్మీ యూనిఫాం ధరించిన ఆరుగురు విదేశీ ఉగ్రవాదులు బాధితులను ఇస్లామిక్ శ్లోకాలను పఠించమని అంతేకాకుండా వారి పేర్లను వెల్లడించమని బలవంతం చేసి మరి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఇది ఒకటి.  

విద్యార్థి వీసాతో పాకిస్తాన్‌కు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహారాలోని గుర్రే గ్రామానికి చెందిన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో విద్యార్థి వీసాతో పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ ఆరు సంవత్సరాల పాటు  టెర్రరిస్ట్ ​కార్యకలాపాల్లో శిక్షణ తీసుకుని తిరిగి నలుగురు ఉగ్రవాదులతో ఇండియాకు వచ్చాడు. భారత్ ను విడిచి వెళ్లక  ముందు కూడా అతను నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు.  పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత అతను తన కుటుంబంతో పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు.  దాదాపు ఎనిమిది నెలల పాటు అతని ఉనికిని కూడా ఎవరూ గుర్తించలేకపోయారు.   

బైసరన్ ఊచకోతలో పాల్గొన్న ముగ్గురు ప్రధాన అనుమానితులలో థోకర్ ఒకరని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారికంగా పేర్కొన్నారు. మిగిలిన ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు - హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ గా గుర్తించారు. ఆ ముగ్గురి స్కెచ్‌లు విడుదలయ్యాయి. వారిపై రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు గైడ్, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్‌గా ఆదిల్ థోకర్ పనిచేసినట్లు నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.  కాగా ఆదిల్ థోకర్ ఇంటిని  గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం  కూల్చివేసింది.  

Also Read :  Big Breaking : కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్

Advertisment
తాజా కథనాలు