/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/84b579a6b5672b891eff8ac99d342ee61717292468879706_original_1-1.jpg)
ఇప్పుడే కాదు భవిష్యత్తులో వాట్సాప్‌ను ఎవరూ అధిగమించలేరు అన్నట్టుగా యాప్‌ను అప్డేట్ చేస్తోంది మెటా. నెలకొకటి అయినా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతూ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ యూజర్లకి బెస్ట్ ఎక్సపీరియన్స్ ఇచ్చేందుకు ముందుండే మెటా ఇప్పుడు మెసేజ్ త్రెడ్స్ అంటూ మర కొత్త ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అయింది. ఇది వాట్సాప్ లో గ్రూ్ చాట్స్, సర్శనల్ చాట్స్ ను మరింత ఎఫెక్టివ్ గా చూపిస్తుందని చెబుతోంది.
మెసేజ్ త్రెడ్స్..
ఒక మేసేజ్ కు వచ్చిన రిప్లైలన్నింటినీ ఒకే చట చూపించడం ఈ మెసేజ్ త్రెడ్ స్పెషాలిటీ. ఇప్పటివరకు ఏదైనా ఒక మెసజ్ కు ఏం రిప్లైలు వచ్చాయో చూడాలంటే...కిందకు , పైకి వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుండేది. ఇప్పుడు మెసేజ్ త్రెట్స్ తో ఆ కష్టాలు తీరిపోతాయి. అన్నింటినీ ఒకేచోట చూపిస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఫాలో అయిపోవచ్చును. గ్రూప్ చాట్స్ లో ఏ మెసేజ్ కి రెప్లైస్ అన్ని ఒకే చోట పాప్ అప్ స్క్రీన్ లో కనిపించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లకు చాలా టైమ్ సేవ్ అవనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. అక్కడ సక్సెస్ అయితే వెంటనే అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం బీటా వర్షన్ లో లిమిటెడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అన్ని వర్షన్స్ కి అందుబాటులోకి రానుంది.