Bengal: తగలబడుతున్న బెంగాల్.. ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం.. రెచ్చిపోయిన నిరసనకారులు!

వక్ఫ్‌ బిల్లును అమలు చేయబోమని బెంగాల్ ప్రభుత్వం చెప్పినా సమస్య సద్దుమణగడం లేదు. ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వక్ఫ్‌ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యాపారాలు, ఇళ్లు ధ్వంసం చేసిన 150 మంది నిరసకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update

Anti - Waqf Protest: వక్ఫ్‌ బిల్లును అమలు చేయబోమని బెంగాల్ ప్రభుత్వం చెప్పినా సమస్య సద్దుమణగడం లేదు. ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వక్ఫ్‌ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యాపారాలు, ఇళ్లు ధ్వంసం చేసిన 150 మంది నిరసకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇళ్లు, వాహనాలు ధ్వంసం..

వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ్ బెంగాల్‌లో మొదలైన నిరసనలు హింసకు దారితీశాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉత్తర బెంగాల్‌లో ముస్లీం ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేసి, నిప్పంటించారు. సుతి, ధులియన్, జంగీపూర్, కోల్‌కతా, మాల్దా, హౌరా ప్రాంతాల్లోనూ తీవ్ర హింస చెలరేగింది. రైల్వే స్టేషన్‌పై దాడులు చేసి, కంట్రోల్ రూమ్‌ని ధ్వంసం చేశారు. వాహనాలను తగులబెట్టడంతో పాటు దుకాణాలను లూఠీ చేశారు. ఈ అల్లర్లలో హిందువుల వ్యాపారాలు, ఇళ్ల ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. అల్లరిమూకల చర్యలతో ముగ్గురు మృతి చెందారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 150 మందిని అరెస్ట్ అయ్యారు.

హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. అయినప్పటికీ హింసకు ఎందుకు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించారు. అటు ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారటంతో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో సుధీర్ఘ చర్చల తర్వాత ఏప్రిల్ 4న వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌గా పేరుతో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణతో పాటు అవినీతిని తగ్గించడం, వక్ఫ్‌ ఆస్తులను మెరుగ్గా నిర్వహించడమే ఈ బిల్లు లక్ష్యమని కేంద్రప్రభుత్వం చెప్పింది. 

1995 కి భిన్నంగా వక్ఫ్ చట్టం..

అయితే కొత్తగా తెచ్చిన సవరణ బిల్లు వక్ఫ్ చట్టం 1995 కి భిన్నంగా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించడంతో పాటు సొంత ఆస్తి ఉండాలి. తాజా చట్టంలో వక్ఫ్‌ బై యూజర్‌ నిబంధనను తొలగించింది. అలాగే స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. సర్వే బాధ్యతలు జిల్లా కలెక్టర్ కు వెళ్లాయి. వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటుతో పాటు అందులో ఇద్దరు స్త్రీలు, ఇద్దరు ముస్లిం కాని సభ్యులకు అవకాశం కల్పించాలని చెప్పింది. ఇక వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కాదని... అభ్యంతరాలు ఉంటే 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండదు. దీంతో కొత్త సవరణ బిల్లును ముస్లీం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 

Also Read: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ముస్లింలపై వివక్షత చూపడటంతో పాటు రాజ్యాంగంపై బహిరంగం దాడి అని విమర్శించాయి. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెడితే.. 2025 బిల్లు.. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నివారిస్తుంది కేంద్రం వాదిస్తోంది. మరీ ఈ సవరణలు ముస్లిం సమాజ ఆస్తుల నిర్వహణలో కొత్త దశను తీసుకువస్తాయా లేదా అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. 

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

waqf-act | highcourt | telugu-news | today telugu today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు