తెలంగాణకు మన్మోహన్ చేసింది మరువలేం. పార్లమెంట్‌ బిల్లు టైంలో..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశ పెట్టడంలో కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేయించారు.

author-image
By K Mohan
New Update
Manmohan Singh

TG mann Photograph: (TG mann)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశ పెట్టడంలో కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేయించారు. హైదరాబాద్‌కు మెట్రో ట్రైన్  కూడా ఆయన హయాంలోనే మంజూరైంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ వేయడం, ఆంధ్ర ప్రదేశ్ ఎంపీల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా.. బిల్లును పాస్ చేయించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని నిరూపించారు. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉంది. దీంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, సాధకబాధకాలపై అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

అప్పటి కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ 2005లో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయంలో తమ అభిప్రాయాలు తెలపాలని కోరుతూ ప్రణబ్ నాయకత్వంలోని కమిటీ అన్ని పార్టీలకు లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 36 పార్టీలు అనుకూలంగా సమాధానం పంపాయి. తెలంగాణ ఏర్పాటుకు అన్నీ పార్టీల మద్దతు కూడగడ్డానికి మన్ మోహన్ సింగ్ చర్చలు జరిపారు. యూపీఏ కూటమిలోని 13 పార్టీలలో 11 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించాయి. యూపీఏ ప్రభుత్వాన్ని బయటనుండి సమర్థిస్తున్న 6 పార్టీలు సహా, అప్పటి ప్రతిపక్షమైన ఎన్డీయేలోని 8 పార్టీలు కూడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే లేఖలు ఇచ్చాయి. 

రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు ఆయన కృషిని గుర్తుచేసుకుంటూ మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. 2009 నుంచి 2014 వరకు ఉద్యమం తీవ్రత ఎక్కవైనప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎలా మంచి చేయాలని ఆయన ఆలోచించారు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ బిల్లును ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో సూచించారు.

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ 

మాజీ మంత్రి హరీశ్ రావు

 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాజీ ఎంపీ వినోద్ కుమార్

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్కమార్క

తెలంగాణ ముఖ్యమంత్రి 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు