Maharashtra & Jharkand Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌తో తో పాటూ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలతో పాటూ వాయనాడ్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా నవంబర్ 13న నిర్వహించనున్నారు. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.
Also Read: ఎయిర్ ఇండియా మరికొన్ని విమానాలకు బాంబుల బెదిరింపు
బరిలోకి ప్రియాంకగాంధీ..
వాయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పోలంగ్ కూడా నవరంబర్ 13 న జరగనంది. దీనికి కాంగ్రెస్ నుంచి ప్రియాంకగాంధీ బరిలోకి దిగుతున్నారు. ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం ఇదే మొదటిసారి. మేలో జరిగిన ఎన్నికల్లో రాహల్ గాంధీ వాయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడమే కాకుండా రెండు థానాల్లోనూ భారీ విజయం కూడా సాధించారు. అయితే ఈ రెండిటిలోఒక దానిలోనే ఆయన కొనసాగడం కుదురుఉంది కనుక వాయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. ఈంతో వాయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానానికే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్‌లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
Also Read: మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!?
Also Read: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..!
నవంబర్ 23న ఫలితాలు..
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఈసీ ఉపఎన్నికలు ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఇక జార్ఖండ్‌లో రెండు విడతల్లో నవంబర్ 13, 20న ఓటింగ్ జరగనుంది. అన్ని స్థానాల ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.