వరకట్నం కింద కశ్మీర్ అడిగిన మాజీ ప్రధాని.. పాక్ మహిళకి షాక్

పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన వాజ్‌పేయీకి ఊహించని అనుభవం ఎదురైనట్లు చెప్పారు. ఆ పర్యటనలో వాజ్‌పేయీ ప్రసంగానికి ఆకర్షితురాలైన ఓ మహిళ మాజీ ప్రధానికి ఓ ప్రపోజల్ పెట్టినట్లు తెలిపారు. అయితే, వాజ్‌పేయీ సమాధానం ఆమె నోరు మూయించిందని వివరించారు.

New Update
DSF

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయీకి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను డిసెంబర్ 25న గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ వాజ్‌పేయీకి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చారు. 

పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన వాజ్‌పేయీకి ఊహించని అనుభవం ఎదురైనట్లు చెప్పారు. ఆ పర్యటనలో వాజ్‌పేయీ ప్రసంగానికి ఆకర్షితురాలైన ఓ మహిళ మాజీ ప్రధానికి ఓ ప్రపోజల్ పెట్టినట్లు తెలిపారు. అయితే, వాజ్‌పేయీ సమాధానం ఆమె నోరు మూయించిందని వివరించారు. ‘ఓసారి వాజ్‌పేయీ పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ స్పీచ్‌కు అట్రాక్ట్‌ అయిన ఓ మహిళ.. వెంటనే వాజ్‌పేయీ వద్దకు వచ్చి ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?’ అని అడిగింది. దానికి వాజ్‌పేయీ ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. కానీ కట్నం కింద పాకిస్థాన్ కావాలి’ అని అడిగారు’ అని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు