/rtv/media/media_files/2024/12/05/HarHmVYjQmTZomM8ukdJ.jpg)
తన ఫోన్ ట్యాప్ చేశారని రెండు రోజులక్రితం కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్ ముందు హల్ చల్ చేశారు. ఫిర్యాదు ఇచ్చినా పట్టిచుకోవడం లేదని పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ లో విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 20 మంది మీద పోలీసులు పలు సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. దీని తర్వాత నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని కొండాపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్న ఉదయం కౌశిక్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. రాత్రి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తరువాత కౌశిక్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. రూ.5వేల జరిమానాతో పాటు రెండు షూరిటీలతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
Also Read: USA: నాసా ఛీఫ్‌గా బిలయనీర్ జేర్డ్ ఐజాక్ మెన్