UNION BUDGET 2025: AIకి పెద్ద పీట.. భారీగా కేటాయింపులు

దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలను నెలకొల్పేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఏఐ కేంద్రాల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Budget 2025 Live

Union budget

కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రాలను నెలకొల్పేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు భారత దేశాన్ని టాప్‌లో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెక్నాలజీలో ఏఐ గ్లోబల్ లీడర్ అన్నారు. అలాగే పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యా సంస్థలకు ఆర్థిక వృద్ధి కోసం ఏఐ హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు