/rtv/media/media_files/2025/01/13/Sn33T4XBRsYnj0VqHQ89.jpg)
UGC NET
జనవరి 15న (బుధవారం) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. 16న జరగాల్సిన పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. ఇదిలాఉండగా.. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్షలు జనవరి 3 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
Also Read: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !
అయితే మకర సంక్రాంతి, పొంగల్, ఇతర పండుగల దృష్ట్యా జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలని ఎన్టీఏకు సిఫార్సులు వచ్చాయి. విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ.. యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. అయితే జనవరి 15 నాటి పరీక్షను మళ్లీ వేరే తేదీలో నిర్వహించనున్నారు. కానీ దీనికి సంబంధించిన తేదీని ప్రకటించలేదు. త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది.
Also Read: జూకర్‌బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలాఉండగా యూజీసీ నెట్.. మాస్టర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. దీని ద్వారా అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్, అలాగే PhDలో ప్రవేశానికి అర్హత పొందుతారు. ప్రస్తుతం చూసుకుంటే యూజీసీ నెట్ పరీక్ష మొత్తం 85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.