IND vs PAK : క్రికెట్, రక్తం ఎలా కలిసి ఉంటాయ్ మోదీ .. శివసేన ఫైర్

ఆసియా కప్ లో  భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడీ మ్యాచ్ పై రాజకీయ వివాదం చెలరేగింది. బీసీసీఐపై శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) తీవ్రస్థాయిలో విరుచుకపడింది.

New Update
modi

ఆసియా కప్ లో  భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడీ మ్యాచ్ పై రాజకీయ వివాదం చెలరేగింది. బీసీసీఐపై శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) తీవ్రస్థాయిలో విరుచుకపడింది. నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని దేశ ప్రధానమంత్రి అంటున్నప్పుడు క్రికెట్, రక్తం ఎలా కలిసి ఉంటాయని ఆదిత్య థాకరే ప్రశ్నించారు.  బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రజల భావాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మ్యాచ్‌ను నిర్వహించడం ద్వారా బీసీసీఐ కోట్లాది రూపాయలు సంపాదిస్తోందని థాకరే ఆరోపించారు.

ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాం

దేశంలో తీవ్ర ఉగ్రవాద బెదిరింపులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడడం సరికాదని అన్నారు. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత క్రికెటర్లకు పిలుపునిచ్చారు మరోనేత సంజయ్ రౌత్. పుల్వామా, ఇతర ఉగ్రవాద దాడులను ఆయన ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం ద్వారా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నామని ఆయన ఆరోపించారు. దేశానికి గౌరవం ముఖ్యం, దేశభక్తి ముఖ్యం. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, దేశభక్తిని చూపించే అవకాశం కూడా అని రౌత్ వ్యాఖ్యానించారు. 

కాగా ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న కీలక మ్యాచ్ జరగనుంది. రాజకీయ, ఉగ్రవాద ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. అయితే, ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు